నిజంగా ఇది బ్యాడ్ అండ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి ఏడాదికి గాను సీనియర్ సిటిజన్స్ వెల్‌ఫేర్ ఫండ్ కింద చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంటే ఈ వడ్డీ రేట్లు తగ్గింపు నిర్ణయం 2019 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. 

 

అయితే ఈ ఫండ్‌లోని డబ్బును సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం ఆవిష్కరించే స్కీమ్స్‌ కోసం ఉపయోగిస్తారు.. అంతేకాదు.. 2018 ఏప్రిల్ 1 నుండి 2019 మార్చి 31 వరకు సీనియర్ సిటిజన్స్ వెల్‌ఫేర్ ఫండ్ డిపాజిట్లపై 7.9 శాతం వడ్డీ రేటు ఉంది. అయితే ఈ సంవత్సరం అంటే.. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి ఏడాదికి గాను వడ్డీ రేటు 6.85 శాతానికి తగ్గించింది.

 

దీనికి సంబందించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాక ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తో సీనియర్ సిటిజన్స్‌కు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్స్ వెల్‌ఫేర్ ఫండ్‌ను ఫైనాన్స్ యాక్ట్ 2015 ప్రకారం ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ లక్ష్యంగా ఈ స్కీంను ఆవిష్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: