దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 415కు చేరింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వ్యాపారులకు కరోనా ప్రభావంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు కరోనా ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 
 
మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. కూలీపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో పరిశ్రమ సమాఖ్య అసోచామ్ సంవత్సరంపాటు రుణ చెల్లింపులపై మారిటోరియం కల్పించాలని కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూల ప్రభావం చూపుతూ ఉండటంతో అసోచామ్ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. 
 
అసోచామ్ ఈ ప్రతిపాదననను నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు పంపింది. రుణచెల్లింపులపై మారటోరియం విధించటంతో పాటు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు వెంటనే నిధులు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అసోచామ్ చట్టాలను సవరించాల్సి ఉందని ప్రతిపాదనలు చేసింది. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రస్తుతం 50 శాతంగా ఉన్న జీఎస్‌టీ క్రెడిట్ ఆప్షన్ ను 100 శాతానికి పెంచాలని కోరింది. కేంద్రం అసోచామ్ ప్రతిపాదనల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: