దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా బ్యాంకుల పని వేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రంలో మార్చి 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. 
 
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. రాష్ట్రంలో రుణాలు మంజూరు చేయడం... కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం తాత్కాలికంగా నిలిచిపోయినట్లే అని సమాచారం. 50 శాతం సిబ్బందితో మాత్రమే రాష్ట్రంలో బ్యాంకులు పని చేయనున్నాయని తెలుస్తోంది. బ్యాంకర్ల సమితి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకులను బంద్ చేయనుంది. 
 
ఇప్పటివరకూ తెలంగాణలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 7 కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈరోజు విశాఖలో 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: