మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా..? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే తాజాగా ఈ గ‌డువును మ‌రింత పొడిగించారు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి ఇప్పటికే అనేక సార్లు గడువు ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. 

 

ఇప్పుడు కూడా మరోసారి డెడ్‌లైన్‌ను పొడిగించారు. సాధారణంగా పాన్ ఆధార్ లింక్ గడువు మ‌రో ఏదు రోజుల్లో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గుడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశాలున్నట్లు నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదాయపన్ను చెల్లింపునకు ఉన్న మార్చ్ 31వ తేదీ గడువును.. మూడు నెలలపాటు అంటే జూన్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 

 

దీంతో ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసేందుకు గడువు తేదీని కూడా పొడిగించారు. కాగా, ఆధార్, పాన్ కార్డు లింకింగ్ ప్రాసెస్ ను ఎన్నోసార్లు పొడిగించినప్పటికీ కొంతమంది తమ కార్డులను లింక్ చేసుకోలేకపోయారు. జనవరి 27 నాటికి చూస్తే దేశంలో 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ అయ్యాయి. అయితే ఇంకా చాలా పాన్ కార్డులు ఆధార్ కార్డులలో అనుసంధానం కావాల్సి ఉంది. 17.58 కోట్ల పాన్ కార్డులు ఆధార్ నెంబర్లతో లింక్ కావాల్సి ఉంది. అంటే ఇవ్వన్నీ ఇప్పుడు జూన్ 30 తర్వాత చెల్లుబాటు కావు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: