ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు భారీ షాక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ పై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. పార్లమెంట్ దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలపడoతో మరికొన్ని రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుత రేట్లతో పోలిస్తే లీటర్ కు 8 రూపాయలు పెరగనున్నాయని తెలుస్తోంది. 
 
అంతర్జాతీయంగా రష్యా, ఒపెక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల గత కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం తగ్గిన రేట్లకు అనుగుణంగా సుంకాన్ని పెంచుతూ వాహనదారులకు వరుస షాకులు ఇస్తూనే ఉంది. కేంద్రం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో పెట్రోల్, డీజిల్ పై ఇష్టారీతిన పన్నులను పెంచుతోంది. కేంద్రం ప్రస్తుత చట్టంలో ఎక్సైజ్ సుంకం 8 రూపాయల వరకు పెంచుకునేలా ప్రతిపాదనలు చేసింది. 
 
రెండు వారాల క్రితం కేంద్రం పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయల చొప్పున సుంకం పెంచిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే కేంద్రం వాహనదారులకు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుకునే అవకాశం కల్పిస్తూ షాక్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కు డిమాండ్ తగ్గడంతో రేట్లు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచటంతో వాహనదారుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: