ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల శ్రేయస్సు కోసమే అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల పేద ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం వీరికి మేలు చేయాలనే ఉద్దేశంతో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కరోనాను కట్టడి చేయడానికి ప్రజలందరి సహకారం కావాలని అన్నారు. 
 
ఈరోజు మధ్యాహ్నం మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. అనంతరం ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ 3 రూపాయలకు కిలో బియ్యం, 2 రూపాయలకు కిలో గోధుమలు అందించేందుకు చర్యలు చేపడుతున్నమని ప్రకటన చేశారు. సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయవచ్చని చెప్పారు. దేశంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. 
 
నిత్యావసర సరుకులు, పాల విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని... వాటిని నమ్మవద్దని... నిర్ణీత సమయం వరకు ఆ దుకాణాలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కేంద్రం ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని... ప్రజల మద్దతు అవసరమని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: