చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేలా ఉంది. వేల సంఖ్యలో ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న ఆ మహమ్మారి ప్రపంచాన్ని ఆర్థికంగానూ విపరీతంగా దెబ్బ తీయబోతోంది. మళ్లీ మరోసారి ప్రపంచం మాంద్యం కోరల్లో చిక్కుకునే ప్రమాదం తీవ్రంగా కనిపిస్తోంది. 

 

మళ్లీ 2008 – 2009 నాటి మాంద్య పరిస్థితులు తలెత్తుతాయని కొందరు అంటుంటే.. అబ్బే అంత కంటే దారుణంగా ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. కరోనా మహమ్మారి ధాటికి అన్నిదేశాల్లోని అన్ని వ్యవస్ధలూ స్తంభించిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ఇప్పటికే ప్రవేశించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐఎంఎఫ్ తెలిపింది.


అంతే కాదు.. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం 2009 కంటే దారుణంగా ఉంటుందని ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చేసింది. కరోనా దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు నిలదొక్కుకునేందుకు 2.5 ట్రిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని ఈ సంస్థ లెక్కలు వేసింది. 


మరో విషయం ఏంటంటే... ఈ మొత్తం కూడా చాలా తక్కువేనంటోంది. ఇక కరోనా కాటుతో అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని వారాలుగా 83 బిలియన్‌ డాలర్లను కోల్పోయినట్లు అంచనా వేసింది ఐఎంఎఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: