దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ పతనమైంది. బెంచ్‌మార్క్ సూచీలు డీలా పడ్డాయి. బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అలాగే రూపాయి కూడా భారీగా నష్టపోవ‌డం గ‌మ‌నార్హం  అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల్లో క‌రోనా విజృంభిస్తుండ‌టంతో దేశీ స్టాక్ మార్కెట్లు ప‌త‌న‌మ‌య్యాయి. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో గ్లోబల్ మార్కెట్లు నష్టపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.  ఫైనాన్షియల్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల వల్ల సూచీలు ఏకంగా 5 శాతం పడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల మేర కుప్పకూలింది. 28,291 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 416 పాయింట్ల నష్టంతో 8250 స్థాయికి పతనమైంది. 

 

చివరకు సెన్సెక్స్ 1375 పాయింట్ల నష్టంతో 28,440 పాయింట్ల వద్ద, నిఫ్టీ 371 పాయింట్ల నష్టంతో 8,289 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఇక  నిఫ్టీ 50లో సిప్లా, టెక్ మహీంద్రా, నెస్లే, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల‌ను ద‌క్కించుకున్నాయి. ఇక సిప్లా ఏకంగా 7 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే  బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు మాత్రం నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 12 శాతం నష్టపోవ‌డం దారుణం. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజ‌యి వాటాదారుల‌కు న‌ష్టాన్ని మిగిల్చాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి.

 

 నిఫ్టీ ఎఫ్ఎంసీజీ దాదాపు 1 శాతం, నిఫ్టీ ఫార్మా 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 6 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 5 శాతం కుప్పకూలాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 6 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 3 శాతం నష్టపోయాయి. నిప్టీ రియల్టీ 7 శాతం కుప్పకూలింది. నిఫ్టీ మెటల్ 3 శాతం, నిఫ్టీ ఐటీ 2 శాతం నష్టపోయింది.ఇకపోతే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా ప‌త‌న‌మైంది.  ఏకంగా 63 పైసలు నష్టంతో 75.49 వద్ద కదలాడుతుండ‌టం గ‌మ‌నార్హం.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. రానున్న రోజుల్లో క్రుడాయిల్ ధ‌ర‌లు మరింత త‌గ్గుముఖం ప‌డుతాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.83 శాతం తగ్గుదలతో 26.33 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 5.25 శాతం క్షీణతతో 20.38 డాలర్లకు తగ్గింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: