దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. గ్యాస్ కంపెనీలపై కూడా లాక్ డౌన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. 
 
గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తోంది. కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని... సిలిండర్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒక బుకింగ్ కు మరో బుకింగ్ కు మధ్య 15 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేసింది. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేనప్పటికీ గ్యాస్ సిలిండర్ వెంటనే బుక్ చేసుకోవడం వీలు కాదని పేర్కొంది. 
 
ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. ఒకేసారి అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటివరకు బుకింగ్ విషయంలో ఎటువంటి పరిమితులు లేవు. సాధారణ ప్రజలు ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: