దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని...  ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరాన్ని జూన్ 30కు పొడిగిస్తూ ఆదేశాలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం పొడిగింపు కోసం చట్టంలో కీలక మార్పులు చేసిందని.... కొత్త ఆర్థిక సంవత్సరం జులై 1వ తేదీ నుండి మొదలవుతుందని కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని ప్రచారం జరుగుతోంది. కేంద్రం ఈరోజు విడుదల చేసిన గెజిట్ లో ఆర్థిక సంవత్సరాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొందని.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులకు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు ప్రయోజనం కలగనుందని మధ్యాహ్నం నుంచి ప్రచారం జరుగుతోంది. 

కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతిరోజూ లాక్ డౌన్ వల్ల వేల కోట్ల రూపాయల నష్టంవస్తోంది. దేశంలోని అన్ని రంగాలు కరోనా వల్ల దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య వర్గాల కోరిక మేరకు ఆర్థిక సంవత్సరం పొడిగింపు కోసం అభ్యర్థనలు రాగా కేంద్రం ఆర్థిక సంవత్సరం పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వైరల్ కాగా తాజాగా ఆర్థిక సంవత్సరం పొడించలేదని కేంద్రం ప్రకటన చేసింది. దీంతో వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని తేలింది. 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: