ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారత్ మొత్తం లాక్ డౌన్ అయ్యింది. దీంతో ఏప్రిల్ 14వ తేదీ వరుకు ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదు. అందుకే 70శాతం ప్రజలు ఇంటికి పరిమితం కాగా తిరుగుబోతులు ఇంకా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి.

 

అయితే ఇప్పుడు స్థిరంగా కొనసాగినప్పటికీ అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత దారుణంగా తగ్గిపోయాయి. కేవలం నాలుగు రోజుల్లో 6 రూపాయిలు తగ్గాయి. ఇంకా అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం పెరగకుండా.. తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు రేపు ఎలా ఉంటాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: