క‌రోనా వైర‌స్ కార‌ణంగా భార‌త్‌లో లాక్‌డౌన్ అమ‌లవుతోన్న ఆప‌త్కాలంలో వాట్సాప్‌..ఐసీఐసీఐ బ్యాంకు సంయుక్తంగా ఒక అద్భుత‌మైన సేవ‌తో ముందుకు వ‌చ్చాయి. వాట్సాప్‌తో బ్యాంకింగ్‌ సేవలు పొందే సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు క‌ల్పిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నడుస్తుండటంతో ఇంటినుంచే బ్యాంకింగ్‌ అవసరాలు పూర్తిచేసే విధంగా ఈ సేవలను రూపొందించింది. వాట్సాప్‌  ‘ఐసీఐసీఐస్టాక్‌‘ సేవలను రిటైల్‌, బిజినెస్ ఖాతాదారులు కూడా వినియోగించుకోవ‌చ్చు.ఈ  స‌రికొత్త ఫీచ‌ర్‌లో దాదాపు 500 రకాల సేవలు లభిస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

 

 సేవింగ్స్‌ ఖాతా నిల్వ, గత మూడు లావాదేవీలు, క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి, తక్షణ రుణం, క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ బ్లాక్‌, అన్‌బ్లాక్‌ వంటి సేవలనూ కూడా పొంద‌వ‌చ్చు.బ్యాంకు ప్ర‌తినిధులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఇలా చేయాలి. ఖాతాదారుడు ఐసీఐసీఐ బ్యాంక్‌ ధ్రువీకరించిన వాట్సాప్‌ ప్రొఫైల్‌ నంబరు 9324953001 ను మొబైల్‌ కాంటాక్ట్స్‌లో సేవ్‌ చేసుకోవాలి. ఆ త‌ర్వాత బ్యాంక్‌లో నమోదైన ఖాతాదారు మొబైల్‌ నంబరు నుంచి ఈ నంబరుకు ‘హాయ్‌’ అని టెక్ట్స మెసేజ్ చేయాలి.  దీని త‌ర్వ‌త మీ మొబైల్‌కు బ్యాంక్‌ సేవల వివరాలతో కూడిన జాబితాను వారు సెండ్ చేస్తారు. సేవల జాబితాలో మనకు అవసరమైన సేవకు సంబంధించి కీవర్డ్‌ను ఉప‌యోగించి న‌మోదు చేయాలి. ఉదాహరణకు (బ్యాలెన్స్‌), (బ్లాక్‌) ;  అనంతరం సేవలను పూర్తిచేయొచ్చు.

 

 ఇదిలా ఉండ‌గా  మొబైల్‌ ప్రీపెయిడ్‌ కనెక్షన్ల రీఛార్జి గడువును  (వ్యాలిడిటీ) పెంచుతూ నిర్ణ‌యం తీసుకోవాల‌ని టెలికాం సంస్థ‌ల‌కు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలుండటంతో, రీఛార్జి దుకాణాలు తెరవకపోవడమే ట్రాయ్ తాజా ఉత్త‌ర్వులు ప్ర‌ధాన కార‌ణం. చాలా మందికి ఆన్‌లైన్‌ సౌలభ్యాన్ని వినియోగించడం తెలియదు. రీఛార్జ్‌ చేసుకోకపోతే ఈ సిమ్‌లకు సేవలు నిలిచిపోవచ్చు. ఈ అవాంత‌రాన్ని నిరోధించ‌డానికి ప్రీపెయిడ్‌ కనెక్షన్ల రీఛార్జి గడువు పొడిగించాలని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ట్రాయ్ సూచ‌న‌ల మేర‌కు ఇప్ప‌టికే ఎయిర్‌టెల్ ఏప్రిల్ 20వ‌ర‌కు ఉచిత ఇన్‌క‌మింగ్ సేవ‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్లు తెలిపిపింది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: