జీతాల కోత అంటూ.. క‌రోనా దోపిడీకి ప్రైవేటు సంస్థ‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి శ‌ష‌భిష‌లు లేకుండా ప్ర‌క‌టించ‌డంతో...ఎలాగోలా జీతాల కోత‌తో ఉద్యోగుల‌కు వాత పెట్టాల‌ని భావించిన ప్రైవేటు సంస్థ‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. క‌రోనా కార‌ణంగా ఆదాయం త‌గ్గిపోవ‌డంతో సంస్థ‌లు ఆర్థిక భారం త‌గ్గించుకోవ‌డంలో త‌ప్పులేదు కాని. లాక్‌డౌన్ ప్రారంభమై కేవ‌లం వారం రోజుల‌కే ఇలా స‌గానికి సంగం జీతం కోత విధించ‌డం పైనే తీవ్ర విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా మ‌రికొన్ని ప్రైవేటు సంస్థ‌లైతే అసలు జీతాలే వాయిదా వేద్దాములే అన్న ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

 

క‌రోనా కార‌ణంగా ముంద‌స్తుగా అనేక సామ‌గ్రిని కొనుగోలు చేసి పెట్టుకున్న మ‌ధ్య‌, పేద త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ఇలా ఆర్థిక ఉప‌ద్ర‌వం ముంచుకు రావ‌డంతో ఏం చేయాలో అర్థం కాక  చేతులు పిసుకుంటున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇదే పరిస్థితి. వాస్త‌వానికి నిన్న‌టి వ‌ర‌కు ప్రైవేటు సంస్థ‌ల ఆలోచ‌న‌లు మ‌రోర‌కంగా ఉండేవి. అటు యజమానులకూ ఒకటే అనుమానం. ఇఎమ్ఐ లు వాయిదా వేసారు. అద్దెలు వసూలు చేయద్దన్నారు. అందువల్ల జీతాలు కూడా కట్ చేయవద్దని మోడీ ఆదేశిస్తారేమో? ఫుల్ శాలరీలు ఇచ్చేయాల్సి వస్తుందేమో? అన్న భయం వెంటాడింది. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం కోత‌ల రూపంలో దారి చూప‌డంతో హ‌మ్మ‌య్య అంటూ నిశ్చింత‌లోకి జారుకున్నాయి.

 

నిజానికి మార్చి 31 అంటే లాక్ డౌన్ స్టార్ట్ చేసి వారం రోజులే అయింది. దీనికే 15 రోజుల పాటు జీతాలు కోత వేయడం అంటే నిజానికి సబబు కాద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వచ్చేనెల లో 15 రోజులు సంస్థలు పనిచేయవు అంటే అర్థం వుంది. కానీ ఈ నెలలో అలా కాదుగా. ఇలా ఆలోచనలు సాగుతున్న తరుణంలో ప్రభుత్వమే సగం జీతాలు కోత విధించ‌డ‌మే స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రైవేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌యింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలా అయితే ఏప్రియల్ నెల జీతం రావ‌డం మ‌హా క‌ష్ట‌మేన‌ని కొంత‌మంది ప్రైవేటు ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: