సాధార‌ణంగా నిత్యం బ్యాంకులో లావాదేవీలు చేసుకునే వారకి ఎప్పుడు బ్యాంకులకి సెలవులు ఉంటాయో తెలుసుకోవడం తప్పనిసరి. అయితే ఎవరికైనా ప్రతి రోజూ పని చేయడం కష్టమే. అందుకే ఉద్యోగం చేసే వారికి వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. ఇందుకు బ్యాంక్ ఉద్యోగులు కూడా మినహాయింపేమీ కాదు. వీరికి కూడా వీక్లిఆఫ్ ఉంటుంది. ఇక నేటితో మార్చి నెల ముగుస్తుంది. మ‌రి ఏప్రిల్‌లో వచ్చే సెలవులు గురించి ఖ‌చ్చితంగా తెలుసుకొండి.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో వ‌చ్చే నాలుగు ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లో ఎలాగో బ్యాంకులు ప‌నిచేయ‌వు. మ‌రియు ఏప్రిల్ నెల‌లో వ‌చ్చే రెండు, నాలుగో శనివారాలైన 11, 25 తేదీల్లో సైతం బ్యాంకులు ప‌నిచేయ‌వు. వీటితో పాటు ఏప్రిల్ నెల‌లో అద‌న‌పు సెల‌వులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 2న గురువారం శ్రీ రామనవమి పండుగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. తెలంగాణలో ఈ సెలవు వర్తిస్తాయి.

 

అలాగే ఏప్రిల్ 10 శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే క‌బ‌ట్టి బ్యాంకుల‌కు సెల‌వు. మ‌రియు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కారణంగా బ్యాంకులకు ప‌ని చేయ‌వు. ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు వర్తిస్తాయి. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: