క‌రోనా ఎఫెక్ట్‌తో డాల‌ర్ క‌ల చెదురుతోంది. రూపాయి విలువ పడిపోతుంది. క‌రోనా కోర‌ల్లో చిక్క‌కుని అగ్ర‌రాజ్యం  అమెరికా నుంచి భార‌త్ వ‌ర‌కు అ న్ని దేశా లు విల‌విల‌లాడుతున్నాయి. ఈ వైర‌స్ ధాటికి అన్ని రంగాలు కుప్ప‌కూలుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు చేసే భార‌తీయుల పరిస్థితి మ‌రిం త  దయ‌నీయంగా మారింది. అమెరికాలో రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు అక్క‌డ భార‌తీయ ఐటీ నిపుణుల‌ను కంటి మీదకు నుకులేకుం డా చేస్తున్నాయి. క‌రోనా నుంచి కాపాడుకోడానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న మ‌న‌వాళ్లు రానున్న గ‌డ్డు కాలాన్ని త‌లుచుకుని తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వు తున్నారు. 

ప్ర‌పంచ ఆర్థిక రాజ‌ధానిగా పేరొందిన న్యూయార్క్ క‌రోనా దెబ్బ‌కు అల్లాడుతుంది. గ‌డిచిన ప‌క్షం రోజులుగా న్యూయార్క్‌తోపాటు దాన్ని ఆనుకుని ఉన్న న్యూజెర్సీ లో  అన్ని వ్యాపార‌, వాణిజ్య కార్య‌క్ర‌మాలు నిలిచిపోయాయి. ఆరెండు రాష్ట్రాల‌కు వెళ్లొద్దంటూ పౌరుల‌ను హెచ్చ‌రించిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో మూడు నెల‌ల‌పాటు ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో అక్క‌డ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే కంపెనీలన్నీ ఉద్యోగుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డ్డాయి. మార్చి నెలాఖ‌రుతో  కాంట్రాక్ట్ గ‌డువు పూర్త‌యిన 40 వేల మందికి గ‌డువు పొడిగించ‌లేదు. వీరిలో చాలా వ‌ర‌కు భార‌తీయులే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే  హెచ్ 1 వీసాల‌పై అమెరికాలో పని చేస్తున్న భార‌తీయుల్లో దాదాపు ల‌క్ష‌మంది ఉద్యోగాలు కోల్పోతార‌ని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన‌డం మ‌రింత గుబులు రేపుతోంది. మ‌రోప‌క్క క‌రోనా ఎఫెక్ట్‌తో 2ల‌క్ష‌ల మంది ఉపాధి కోల్పోతార‌ని స్వ‌యంగా అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో భార‌తీయులు తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నారు.  ఈనేప‌థ్యంలో ఓ వైపు విమానాలు ర‌ద్ద‌వ‌డంతో సొంత దేశం రాలేక‌, మ‌రోప‌క్క క‌రోనా భ‌యంతో అమెరికాలో ఉండ‌లేక బిక్కుబిక్కుమంటూ భార‌తీయులు కాలం వెల్ల‌దీస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: