కేంద్రం కొన్ని సంవత్సరాల క్రితం ఆడపిల్లల ఆర్థిక భద్రత లక్ష్యంగా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ స్కీమ్ పై ఎక్కువగా ఆసక్తి చూపారు. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేర్లపై సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను తెరిచే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అర్హులైన వారు మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. 
 
అయితే తాజాగా ఈ పథకంలో చేరిన వారికి ప్రధాని మోదీ భారీ షాక్ ఇచ్చారు. ఈ నెల 1వ తేదీన కేంద్రం సుకన్య సమృద్ధి యోజన, మరికొన్ని పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం వడ్డీ రేట్లను సమీక్షించి వడ్డీ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. తాజాగా చేసిన సవరణల్లో కేంద్రం వడ్డీరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
గతంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరిన వారికి 8.4 శాతం వడ్డీ లభించేది. తాజాగా కేంద్రం వడ్డీ రేటు తగ్గించడంతో వడ్డీ రేటు 7.6 శాతానికి తగ్గింది. ఏడాది టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం నుంచి 5.5 శాతం వడ్డీ రేటును తగ్గింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ లో లక్షన్నర రూపాయలు 15 ఏళ్ల పాటు 8.4 శాతం వడ్డీ చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 74 లక్షల రూపాయలు రాగా కేంద్రం వడ్డీ రేటును తగ్గించడంతో మెచ్యూరిటీ సమయంలో 66 లక్షలు వస్తాయి. అంటే కస్టమర్లు 8 లక్షల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కేంద్రం వడ్డీ రేట్లను పెంచితే మాత్రం ఎక్కువ మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: