పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు వారాలుగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ బారి నష్టాలలో మునిగిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. మూడు రోజుల్లో ఏకంగా మూడు రూపాయిలు తగ్గాయి. అలాంటి ఈ పెట్రోల్, డీజిల్ అలా తగ్గిన సమయం నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి.. 

 

ఇలా స్థిరంగా కొనసాగి పెట్రోల్, డీజిల్ ధరలు చివరికి భారీగా పెరుగుతాయి. గతంలో కంటే కూడా ఎక్కువ పెరుగుతాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. లాక్ డౌన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

 

ఇకపోతే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి... హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: