నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. రోజు మొదటి నుండి ఎక్కడ తగ్గకుండా అన్ని వర్గాలలో లాభాల సునామి కనిపించింది. దీనికి కారణం అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య ఆరంభంలోనే  1300 పాయింట్లు లాభాలలో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపు తడబడినా మళ్లీ మిడ్ సెషన్ నుంచి మరల వేగం పుంజుకుంది. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ, FMCG, ఐటీ, ఆటో రంగాలషేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ ఏకంగా 2476 పాయింట్లు లాభాల బాట పట్టింది. 

 


ఈ దెబ్బతో సెన్సెక్స్ ఏకంగా 30000 ఎగువన స్థిరంగా రోజుని మంచిది. అలాగే నిఫ్టీ కూడా ఏకంగా 708 పాయింట్ల లాభంతో 8792 వద్ద, అలాగే నిఫ్టీ బ్యాంకు 1813 పాయింట్లు ఎగిసి పటిష్టంగా ముగిసింది. ఈరోజు మాత్రం అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇందులో ఇండస్ ఇండ్ 22 %, యాక్సిస్ 20 %, హిందాల్కో 17%, ఎం అండ్ ఎం 14 %, గ్రాసిం14 %, మారుతి 10 % వరకు లాభల బాట పడ్డాయి. 

 

 


ఇక అటు డాలరు మారకంలో భారత రూపాయి కూడా 55 పైసల లాభంతో 75.63 వద్ద కదలాడుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ కు 2.39 శాతం పెరిగి 33.84 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ కు 3.3 శాతం పెరిగి 26.94 డాలర్లకు చేరుకుంది.

 

నిజానికి ఈరోజు నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ లాభాల్లోనే ముగిసాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ లు 10 % పైగా ర్యాలీ జరిగింది. ఇంకా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 11 % లాభపడింది. అలాగే నిఫ్టీ ఆటో 9%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8%, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 8%, నిఫ్టీ మెటల్ 6 % , నిఫ్టీ ఐటీ 7%, నిఫ్టీ రియల్టీ 6% చొప్పున లబ పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: