కరోనా వైరస్‌పరమైన లాక్‌డౌన్‌తో ఎక్కువగా నష్టపోతున్న పరిశ్రమలకు మరింత భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఎస్‌బీఐ ఓ నివేదికలో పేర్కొంది. లాక్‌డౌన్ కార‌ణంగా చాలా ప‌రిశ్ర‌మ‌లు పూర్తిగా న‌ష్టాల్లో కూరుకుపోతున్నాయ‌ని, అవి మళ్లీ య‌థాస్థితికి చేరుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా  ఉద్దీప‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ సవాళ్లను అధిగమించాలంటే కేంద్రం అదనంగా రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని  అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. 


బ్యాంకులకు రావాల్సిన రుణ బకాయిల్లో ఏకంగా 98 శాతం భాగం.. కరోనా వైరస్ ప్రభావిత 284 జిల్లాల నుంచే ఉంటుందని  ఎస్‌బీఐ ఒక నివేదికలో వివరించింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది.  ఇదిలా ఉండ‌గా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగానికి కూడా ఊరటనిచ్చే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 
కేంద్రం త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే పరిస్థితులు ఇంకా దిగజారి ఆయా సంస్థల పెట్టుబడులు మొత్తం హరించుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫ‌లితంగా  కార్మికుల ఉపాధి, హోటళ్లు, విద్య, పెట్రోలియం, వ్యవసాయ రంగాల‌పై అధికంగా ప్ర‌భావం చూపుతుంద‌ని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. 


ఇప్పటికే మందగించిన వృద్ధి రేటు, మూడు వారాల లాక్‌డౌన్‌ దెబ్బతో మరింత క్షీణించే అవకాశం ఉందని వివరించారు. "లాక్‌డౌన్ కారణంగా ఆదాయ నష్టం సుమారు రూ. 3.60 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని తొలి దశలో అదనంగా ప్రకటించిన రూ. 73,000 కోట్లే కాకుండా మరో రూ. 3 లక్షల కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది" అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.  గత నెల కేంద్రం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీలో కేవలం రూ. 73,000 కోట్లు మాత్రమే కొత్తగా ప్రతిపాదించిన నిధులని.. మిగతాదంతా బడ్జెట్‌లో ప్రతిపాదించినదేనని ఆర్థిక నిపుణులు గుర్తు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: