ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌ మార్క్ సూచీలన్నీ పరుగులు పెట్టాయి. నిజానికి కరనా వైరస్ ఇక పీక్ స్టేజ్‌ కి చేరిందనే అంచనాలు, ప్రపంచ దేశాలన్నీ కావలసిన చర్యలు తీసుకోవడంతో లాంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలలో ముగిసాయి. దీంతో దేశీ మార్కెట్‌ పై కూడా సానుకూల ప్రభావంతో నేడు లాభాలతో ముగిసాయి.

 

 

ఇక ఈరోజు ఇంట్రాడేలో సెన్సెక్స్ మొత్తం 1331 పాయింట్ల లాభంతో 31,225 పాయింట్లకు చేరుకుంది. NSE నిఫ్టీ కూడా 380 పాయింట్ల లాభంతో చివరికి 9128 పాయింట్లకు వద్ద ఆగింది. అయితే ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల జోరు దుమ్ము దులిపింది. అయితే చివరికి సెన్సెక్స్ 4.23% అనగా పెరిగి 1266 పాయింట్లు 31,160 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 3.99% అనగా 349 పాయింట్లు లాభంతో 9098 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి.

 

 

ఇక ఈరోజు మార్కెట్ ప్రధానాంశాలు చూస్తే నిఫ్టీ 50 లో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సిప్లా, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు లాభాలలో ముగిసాయి. ఎం అండ్ ఎం ఏకంగా 17% పరుగులు పెట్టింది. అలాగే సుజుకీ కూడా ఏకంగా 14% లాభపడింది. ఇక అదే సమయంలో HUL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. అయితే ఇందులో HUL షేరు 3% పైగా నష్టపోయింది.

 

 

ఇంక అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుంది. కేవలం 4 పైసలు లాభంతో 76.29 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో  ముడి చమురు కాస్త ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కి 5.72% పెరుగుదలతో 34.64 డాలర్లకు చేరగా WTA క్రూడ్ ధర బ్యారెల్‌ కి 8.89% పెరిగి 27.39 డాలర్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: