కరోనా వైరస్ నియంత్రణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రజలంతా కూడా కేంద్రం మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటన చేయడంతో గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు.. దీంతో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డిమాండ్ బాగా పెరిగింది. లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రజలు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

అయితే అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ప్రభుత్వ రంగ oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా అదనపు ఎల్‌పీజీ దిగుమతుల కోసం డీల్ కుదుర్చుకుంది. ఏప్రిల్, మే నెలల్లో కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా కస్టమర్లు బుక్ చేసుకునేలా ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

 

అయితే ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించి సాధారణ దిగుమతుల కంటే ఏప్రిల్, మే నెలల్లో 50 శాతం ఎక్కువ దిగుమతి చెయ్యాలని నిర్ణయించినట్టు ఐఓసీ తెలిపింది. ఇకపోతే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద పేదలకు ఉచితంగా 3 సిలిండర్లు కేంద్రం అందచేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటన వెలువడింది.

 

ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం ఏప్రిల్ నుండి జూన్ వరకు సిలిండర్లను ఇవ్వనుంది. అయితే పీఎంయూవై కస్టమర్లు గ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన పూర్తి డబ్బును వారి అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఐఓసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: