ఈ సంవత్సరం మొదట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి అని అనుకున్నాం.. దీనికి కారణం ఇరాన్, అమెరికా యుద్ధం. కానీ నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి.. అలా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలకు ఒక్కసారిగా కరోనా దెబ్బ పడింది. దీంతో కనివిని ఎరుగని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పడిపోయాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా దెబ్బకు కేవలం అంటే కేవలం నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా నాలుగు రూపాయిలు పడిపోయాయి. ఇంకా ఆతర్వాత 10 పైసలు 20 పైసలు తగ్గుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: