దేశం చాలా క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉంది. ఎంత‌లా అంటే మ‌నిషి గ‌డ‌ప‌దాట‌నంత‌గా...రోడ్డెక్కి క‌నీసం నిత్యావ‌స‌రా వ‌స్తువుల‌ను సైతం కొనుగోలు చేయ‌లేనంతంగా...అంద‌రినీ ప్రాణ‌గండం భ‌య‌పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్ర‌పంచం మొత్తం మాన‌వాళి కార్య‌క‌లాపాలు ఆగిపోవ‌డంతో స్తంభించిపోయింది. అయితే ఇంట్లో కూర్చున్న  కాస్త‌కూస్తో ప‌నులు జ‌రుగుతున్నాయంటే కేవ‌లం అది ఇంట‌ర్నెట్ వ‌ల్లే... ఇంట‌ర్నెట్ వినియోగదారుల సంఖ్య గ‌ణ‌నీయంగాఉంది. టెలికం సంస్థ‌ల‌కు ఇప్పుడు డేటానే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. అయితే లాక్‌డౌన్ ప‌రిణామాల్లో ఆ ఇండ‌స్ట్రీ కూడా చాలా క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. 

 

అయితే జియో మాత్రం ఇన్ని క‌ష్టాల మ‌ధ్య కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు బెస్ట్ స‌ర్వీసును అంద‌జేసేందుకు కృషిచేస్తోందంట‌. జియో ఫైబర్ తెలంగాణలో తమ కస్టమర్ల‌కు బెస్ట్ సర్వీస్‌ను అందించేందుకు నిరంతరం శ్రమిస్తోంది. హైదరాబాద్‌‌తోపాటు తెలంగాణలో కొన్ని ముఖ్య పట్టణాల్లో జియోఫైబర్ తమ సేవలను అందిస్తున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను 1 జీబీపీఎస్ వేగంతో అందిస్తుండ‌టం గ‌మ‌నార్హం. . 

 

అదే వేగంతో ఇతర పట్టణాలకు కూడా జియోఫైబర్ విస్తరించేందుకు సంస్థ అధికారులు వేగంగా పావులు క‌దుపుతున్నారు. అయితే కార్మికుల ల‌భ్య‌త ప్ర‌ధాన ఆటంకంగా ఏర్ప‌డుతోంది. ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని మిగ‌తా ప‌ట్ట‌ణాల్లో కూడా అందుబాటులోకి తేవాల‌ని భావిస్తున్నారు. డేటా వినియోగాన్ని అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద ప్ర‌భుత్వం ప‌రిగ‌ణిస్తుండ‌టం గ‌మ‌నార్హం. వ‌ర్క్ ఫ్రం హోంకు కార్పొరేట్ సంస్థ‌లు ఉద్యోగుల‌కు అనుమ‌తిచ్చిన విష‌యం తెలిసిందే.తాజాగా జియో కొత్త ప్లాన్ల‌ను తీసుకువ‌చ్చింది. కొత్త వినియోగదారులకు ఉచిత కనెక్టివిటీతో 10 ఎంబీపీఎస్ వేగం, 100 జీబీ డేటాను అందిస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: