కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు ఈ కరోనా విజృంభిస్తుంది తప్ప తగ్గటం లేదు.. అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా మన దేశంలో కూడా గత 20 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. మార్చి 2020, ఏప్రిల్ 2020లో చెల్లించాల్సిన ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుల కోసం మరో 30 రోజుల గడువును పొడిగించింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనడంతో ఆర్థికంగా ప్రజలు కష్టాల్లో పడే పరిస్థితి ఉంది.  

 

ఇంకా ఇలాంటి సమయంలో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలా? అని ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఎల్ఐసి కీలక ప్రకటన చేసింది.. ఇంకా ఇలాంటి సమయాల్లో తమ వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చింది అనే చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: