క‌రోనా పంజాకు ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌లం అవుతున్నాయి. లాక్‌డౌన్ అమ‌లుతో అనేక రంగాలు కుదేల‌య్యాయి. ఒక్కో రంగానికి ల‌క్ష‌ల కోట్ల‌లో న‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. రిటైల్ రంగం నుంచి రియ‌ల్ ఎస్టేట్ రంగం వ‌ర‌కు క‌రోనా దెబ్బ‌కు విల‌విలలాడుతున్నాయి. లాక్‌డౌన్ త‌ర్వాత ఉపాధి, ఉద్యోగావ‌కాశాల్లో భారీ కోత‌లుంటాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే భార‌త్‌లో ఆ ప్ర‌మాద ఘంటిక‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని అన్ని రంగాల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు జీడీపీలో కనీసం 10 శాతం సొమ్మును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించాలని వ్యాపారులు కోరుతున్నారు. అటు వలస కార్మికులకు కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తేనే పనులు సాగుతాయని ఈ సందర్భంగా NAREDCO చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

 

ఇదిలా ఉంటే కూడా ఇక చిన్న వ్యాపారులకు ఇప్పటివరకూ జరిగిన నష్టం 2.2 లక్షల కోట్ల వరకూ ఉంటుందని వ్యాపారుల సమాఖ్య అంచ‌నా వేస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టచేకూర్చింది. పలువురు ఆర్థిక వేత్తలు, సంస్థలు అంచనా ప్రకారం దేశం ఆర్థికంగా రూ 7 లక్షల కోట్లు, రూ 8 లక్షల కోట్ల మధ్యలో నష్టపోతుందని తెలుస్తోంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఇప్పటికే 70 శాతం ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. పాక్షికంగా లాక్‌డౌన్ ఎత్తివేయ‌కుంటే ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని వ్యాపారులు హెచ్చ‌రిస్తున్నారు.

 

 శ్రామిక శక్తితో నడిచే భారతదేశంలో ఫ్యాక్టరీలు, భారీ పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. దీని ప్రభావంత దేశ ఆర్థిక రంగంపై ఇంతకు ముందెన్నడూ లేనంత దుష్ప్రభావాన్ని చూపుతుందని వెల్లడైంది.  రేపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేయ‌బొయే ప్ర‌క‌ట‌న‌పై ముఖ్యంగా ఆయా రంగాల‌కు చెందిన వ్యాపారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొంత‌మంది ముఖ్య‌మంత్రులు మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేత‌కు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతూపోతుండ‌టంతో ప్ర‌జ‌లు కూడా వ‌ణికిపోతున్నారు.ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని లాక్‌డౌన్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: