అవునంట.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయంట.. ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి.. కరోనా ఎఫెక్ట్. ఇప్పటికే ఈ కరోనా ఎఫెక్ట్ అన్నిటిపైన పడింది. చెప్పాలి అంటే? అన్ని రంగాల కంటే ముందు పెట్రోల్, డీజిల్ పై కరోనా ఎఫ్ఫెక్ట్ చూపించింది. దీంతో గత నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. 

 

దీంతో ఇంకా అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ పెరగ కుండా.. తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత నెల రోజుల నుండి ఇలాగే కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. 

 

ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గగానే పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయిలో పెరుగుతాయి అని.. ఆ తర్వాత మళ్లీ భారీగా తగ్గుతాయి అని.. అంచనా వేస్తున్నారు. మరి పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: