మొదట్లో పరుగులు పెట్టిన మార్కెట్ మొత్తానికి రోజు ముగిసే సరికి నష్టాల్లోనే క్లోజయ్యింది. అంతర్జాతీయంగా మార్కెట్ల సానుకూల ట్రెండ్ కారణంగా పరుగులు పెట్టిన సూచీలు చివరకు నిరాశను చూపాయి. నేడు మొత్తానికి ఫైనాన్షియల్, ఆటో రంగ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ చివరి గంటలో నష్టాల్లోకి పడిపోయింది. ఇక ఇంట్రాడేలో BSE సెన్సెక్స్ 878 పాయింట్లు లాభపడగా, NSE NIFTY కూడా 9261 పాయింట్ల గరిష్టాన్ని చేరుకుంది. అయితే చివరకు మాత్రం మార్కెట్ లాభాలన్నీ ఆవిరి ఐపోయాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 310 పాయింట్లు నష్టపోయి 30,380 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 8925 పాయింట్ల వద్ద ముగిసాయి.

 

 

ఇక ఈరోజు ముఖ్య విషయాల విషయానికి వస్తే NIFTY - 50లో హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, UPL, HUL, బ్రిటానియా షేర్లు లాభాలలో ముగిసాయి. ఇందులో ఏకంగా UPL ఏకంగా 8% లాభపడింది.  ఇక మరో వైపు బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ,  కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టపోయాయి. ఇందులో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏకంగా 6% నష్టపోయాయి. అయితే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లన్నీ మిశ్రమంగానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌ లు పెరగగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒక్కటి 4% పైగా పెరిగింది. ఇక మిగతా ఇండెక్స్‌ లు అన్ని నష్టపొగ నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు 2% పైగా నష్టాలలో ముగిసాయి. అలాగే అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో స్వల్పనగా ట్రేడ్ అయ్యింది. ఇది 16 పైసలు నష్టంతో 76.44 వద్ద ట్రేడ్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: