కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన బాగానే పడుతుంది. దింతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కోవిడ్ 19 రెగ్యులేటరీ ప్యాకేజీలో భాగంగా ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. దేశీ అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ప్రైవేట్ ఉద్యోగులు, లోన్ లు తీసుకున్న వారి పాలిట శుభవార్త వినిపించారు.

 
 
కానీ, దానికి ఉన్న కండిషన్స్ అప్లై గురించి తెలుసుకోకపోతే భారీగానే నష్టపోతాం. లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని అధికారులు సూచనలు మాత్రమే చేశారు. ఈ మేర మేనేజ్‌మెంట్ రెడీగా ఉంటే జీతాలు ఇస్తుంది లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మారటోరియం వచ్చింది కదా.. ఈఎమ్ఐ కట్టకపోయినా ఇబ్బంది లేదనుకుంటే పొరబాటే. 

 

 

ఈఎంఐ మారటోరియం వాడుకోవద్దనుకునే కస్టమర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే వారి అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. లేదా కస్టమర్లు ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఈఎంఐ మారటోరియం కోరుకునేవారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలు నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌజ్-NACH ద్వారా ఆటో డెబిట్ అవుతుంటాయి. అందుకే (Annexure-II) దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లో ఉన్న ఇమెయిల్ ఐడీకి పంపాలి.

 

ఉదహరణకు హోం లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లు ఏప్రిల్ 5నాటికి  లక్ట కట్టాల్సి ఉంటే ఆ రోజు చెల్లించలేదు. అప్పుడు అసలు + వడ్డీరేటును బట్టి మే5న బిల్లులో వస్తుంది. అప్పటికీ కట్టకపోతే వడ్డీ జూన్ 5 బిల్లులో వస్తుంది. ప్రస్తుత మారటోరియం ప్రకటన ఫలితంగా వీటిని మాత్రమే మినహాయిస్తారు. కానీ, 20నెలల్లో కట్టాల్సిన ఈఎమ్ఐలు 23నెలల్లో కచ్చితంగా కట్టాల్సిందే. ఇలా చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: