ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలని శుక్రవారం ర్యాలీ చేశాయి. bank OF INDIA' target='_blank' title='rbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rbi రివర్స్ రెపో రేటు కోత 25 బేసిస్ పాయింట్లతో సహా వ్యవస్థలో లిక్విడిటీని పెంచడానికి bank OF INDIA' target='_blank' title='rbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rbi తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో మార్కెట్ లాభాలలోకి దూసుకెళ్లింది. దీనితో బ్యాంకులకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇక ఈరోజు BSE సెన్సెక్స్ 1116 పాయింట్లు లాభపడి, 31,719 పాయింట్ల గరిష్టాన్ని చేరుకుంది. NSE నిఫ్టీ కూడా 331 పాయింట్ల లాభంతో 9324 పాయింట్ల గరిష్టానికి చేరుకొని, చివరకు సెన్సెక్స్ 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్ద, నిఫ్టీ 294 పాయింట్ల లాభంతో 9287 పాయింట్ల వద్ద లాభాలలో ముగిసాయి.

 

 

ఇక ఈరోజు విశేషాలకి వస్తే... NIFTY - 50 లో మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, AXIS బ్యాంక్, ఐషర్ మోటార్స్, ICICI బ్యాంక్ ల షేర్లు పెరిగాయి. ఇందులో AXIS బ్యాంక్ 14% పెరిగింది.
ఇక అదేసమయంలో నష్టాల విషయానికి వస్తే HUL, భారతీ ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఇందులో నెస్లే ఇండియా 3% నష్ట పోయింది.

 

 

అలాగే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు కాస్త మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ FMCG, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ లు మినహా మిగతా సూచీలన్నీ లాభపడ్డాయి. ఇక నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 7%, అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 7%, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 5%, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా 5%, నిఫ్టీ రియల్టీ 4%, నిఫ్టీ మీడియా 3%, నిప్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 2% పెరిగాయి. అలాగే ఇక అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి కాస్త లాభాల్లో ట్రేడవుతోంది. నేడు ఏకంగా 46 పైసలు లాభంతో 76.40 వద్ద ట్రేడ్ కదలాడుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో  ముడి చమురు ధరలు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: