లాక్‌డౌన్ మే3 వ‌ర‌కు పొడ‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుందా..? అన్న అనుమానాలు మాత్రం వీడడం లేదు. దేశంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అనేక‌మంది విమాన స‌ర్వీసుల కోసం గంపెడాశ‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌ట్లో రైలు స‌ర్వీసులు ఆరంభమ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల వ‌ర‌కు అంద‌రూ విమాన స‌ర్వీసుల‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు ఎయిరిండియా కాస్త తీపి క‌బురు చెప్పింది.విమాన స‌ర్వీసుల‌పై  కొంతమేర స్పష్టత ఇచ్చింది.  కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ మే 4 నుంచి మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. 


ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి బుకింగ్స్‌ను జూన్ 1 నుంచి మొదలవుతాయని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే ఏయే నగరాలకు ముందుగా బుకింగ్స్ మొదలవుతాయనే అంశంపై మాత్రం ఎయిర్ ఇండియా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. అయితే గ‌తంలో ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ మాత్రం డొమెస్టిక్ విమాన సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ బుకింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం మే 1వతేదీ నుంచి నడపాలని ఇతర విమానయాన సంస్థలు యోచించాయి.  ఏప్రిల్ 15 త‌ర్వాత దేశీయ విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్‌కు ఆహ్వానించాయి. 


 ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమాన సర్వీసులు, మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు. అయితే గ‌తంలో కూడా ఏప్రిల్ 15నుంచి విమాన స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప‌లు సంస్థ‌లు ప్రక‌టించ‌డంతో ప్ర‌యాణికులు పెద్ద సంఖ్య‌లో టికెట్ల‌ను బుక్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత లాక్‌డౌన్ మే3వ‌ర‌కు ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో విమానాయ‌న సంస్థ‌లు ఊసురుమ‌న్నాయి. టికెట్ల డ‌బ్బులు రీఫండ్ చేయ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్ర పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చాకే విమాన స‌ర్వీసుల‌ను న‌డిపించేందుకు ముందుకు రావాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: