ఏప్రిల్ 20 నుంచి ఈ-కామర్స్ సైట్లకు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ద‌క్క‌నున్న విష‌యం తెలిసిందే. అయితే చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్న వేళ కేంద్రం నుంచి మ‌ళ్లీ ఆంక్ష‌ల మాట వినిపిస్తోంది. ఈమేర‌కు వస్తువుల విక్రయానికి అనుమతిస్తూ కేంద్రం గ‌త బుధవారం విడుద‌ల చేసిన‌ లాక్‌డౌన్ మార్గదర్శకాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాన్నిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో మరికొన్ని సవరణలు చేసింది.ఈ-కామ‌ర్స్ ద్వారా కేవ‌లం అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా అయ్యేలా కేంద్రం తాజా ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

 

అత్యవసరం కాని వస్తువుల అమ్మకాన్ని నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఈ కామ‌ర్స్ కార్యకలాపాలను ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్ లేదా నాన్ కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రమే నిర్వహిస్తారు. అలాగే ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల్లో ప‌నిచేసే సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌లను ధరించడాన్ని కేంద్ర హోం శాఖ తప్పనిసరి చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ-కామర్స్‌ సంస్థల వాహనాలకు ఆయా ప్రాంతాల్లోని స్థానిక యంత్రాంగం నుంచి అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే సంస్థ‌ల‌పై ఎపిడ‌మిక్ చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవడం జ‌రుగుతుంద‌ని తెలిపింది.

 

అలాగే ఈ కామ‌ర్స్ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తే చాలామందికి ఇంటినుంచి బ‌య‌ట‌కు వెళ్లే అవ‌స‌రం త‌ప్పుతుంది. ముఖ్యంగా క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌ట్ట‌ణాల్లో ఉండ‌టంతో ఈ సేవ‌లు ఎంత‌గానో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డనున్నాయి.అయితే సిబ్బంది ఎంత మేర‌కు ప‌నిచేసేందుకు ముందుకు వ‌స్తార‌న్న‌ది కూడా ఇప్పుడు ఆయా సంస్థ‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఉద్యోగాల్లో చేరేందుకు చాలామంది సిబ్బంది ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని స‌మాచారం. ఇక హైద‌రాబాద్‌, ఢిల్లీ, ముంబైలాంటి ప్రాంతాల్లో పనిచేసేందుకు సిబ్బంది ముందుకు రావ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని సంస్థ‌లు ఆందోళ‌న‌లో ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: