ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు నిజంగా అదిరిపోయే శుభవార్త ఇది.. ఏంటి ఆ శుభవార్త? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా! ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టా సేవ్ అకౌంట్ సేవలు అందిస్తోంది.. అంటే ఏంటి అంటే? ఆధార్ ఆధారిత ఇన్‌స్టంట్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. 

 

ఈ అకౌంట్ ను ఆన్లైన్ లో తెరవొచ్చు.. కేవలం అంటే కేవలం 18 ఏళ్ళు వయసు ఉంటే సరిపోతుంది.. బ్యాంక్ కేవలం ఇన్‌స్టా సేవ్ అకౌంట్ సేవలు ఒకటే కాదు ఇన్‌స్టా సేవ్ ఎఫ్‌డీ అకౌంట్ సర్వీసులు కూడా మనకు అందిస్తోంది. ఇన్‌స్టా సేవ్ అకౌంట్‌కు నెల నెల మినిమమ్ బ్యాలెన్స్ పది వేల రూపాయిలు ఉండాలి. 

 

కానీ ఇన్‌స్టా సేవ్ ఎఫ్‌డీ అకౌంట్ కు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. అయితే దీనికి సంవత్సరానికి 10 వేలరూపాయిలు ఫిక్స్డ్ డిఫాజిట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక శుభవార్త ఉంది.. అది ఏంటి అంటే? ఐసీఐసీఐ ఎఫ్‌డీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఫ్రీ గానే క్రెడిట్ కార్డు సేవలు అందుతాయి. 

 

అయితే ఇక్కడ మీరు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది.. అది ఏంటి అంటే? మీరు లక్ష రూపాయిలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అందులో 90వేలు లిమిట్ తో మీకు క్రెడిట్ కార్డు వస్తుంది. అదే 10 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు అందులో 9వేలు పొందుతారు.. కాబట్టి మీకు క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత డిపాజిట్ కావాలి అనుకుంటే అంత డిపాజిట్ చేసుకోండి.. మీకు అందులో 90 శాతం లిమిట్ తో కార్డు వస్తుంది.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: