దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు పరుగులు పెట్టింది. బెంచ్‌ మార్క్ సూచీలన్నీ నేడు దుమ్మురేపాయి. ముక్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ చేయడం మార్కెట్‌ కు బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అందరికి తెలిసినట్టుగానే ఫేస్బుక్ & రిలయన్స్ జియో డీల్ కారణంగా RIL షేర్లు భారీగా లాభపడ్డాయి. రిలయన్స్ కంపెనీ వంటి హెవీవెయిట్ షేరు సహా ఆటో షేర్లలో లాభాలు మార్కెట్ ‌కు బాగా కలిసొచ్చాయి. ఇక ఇంట్రాడేలో BSE సెన్సెక్స్ 31,471 పాయింట్ల గరిష్టాన్ని చేరుకోగా, NSE ‌నిఫ్టీ కూడా 9209 పాయింట్లకు చేరుకుంది. ఇక రోజు ముగిసే సరికి చివరకు సెన్సెక్స్ 743 పాయింట్ల లాభంతో 31,380 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 9187 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్  కొత్త డీల్ తో షేరు ధర 10% పెరుగుదలతో రూ.1364 స్థాయిని చేరుకుంది.

 

 

ఇక ఈరోజు ముఖ్య విశేషాలు చూస్తే ... నిఫ్టీ 50 లో ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, UPL, జీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. ఇక జీ ఎంటర్టైన్‌మెంట్ షేరు ధర ఏకంగా 20 % లాభపడింది. ఇక నష్టాల విషయానికి వస్తే ONGC, L & T , సిప్లా, పవర్ గ్రిడ్,  వేదాంత షేర్లు నష్టపోయాయి. ఇందులో ONGC 6% నష్టపోయింది. అలాగే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ ‌లన్నీ కాస్త మిశ్రమంగా ముగిసాయి. ఇందులో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు కొద్ది వరకు నష్టపోయాయి. ఇక మిగతా ఇండెక్స్ ‌లన్నీ లాభాలబాట పడ్డాయి. ఇందులో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2% పైగా లాభపడగా, నిఫ్టీ మీడియా ఏకంగా 6% పైగా లాభాలను పొందాయి.

 

 

ఇక అమెరికా డాలర్ ‌తో పోలిస్తే భారత్ రూపాయి లాభాల్లో ట్రేడ్ అవుతుంది. అయితే కేవలం 16 పైసలు లాభంతో 76.67 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ ‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా ముగిసాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌ కు 0.72% పెరిగి 19.47 డాలర్లకు చేరుకుంది. WTI క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 1.99% నష్టపోయి 11.33 డాలర్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: