అంబానీ... ఈ ఒక్క పేరు చాలు. ఆయన సాధించిన విజయాలు ఇలా గుర్తుకు వస్తాయి. ఇకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తిరిగి మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని దక్కించుకున్నారు. దీనికి కారణం మార్క్ జుకర్ ‌బర్గ్ ఫేస్‌బుక్ CEO ‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ ఇందుకు అసలైన కారణం. అందిరికి తెలిసినట్టుగానే ఫేస్ ‌బుక్ రిలయన్స్ జియోలో ఏకంగా 9.99% వాటా కొనుగోలు చేసింది. దీని విలువ ఏకంగా రూ.43,574 కోట్లు. 


అయితే తాజాగా ప్రకటించిన బ్లూమ్‌ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. కేవలం భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీ ఇప్పుడు తిరిగి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని చేరుకొన్నారు. ఈ - కామర్స్ సంస్థ అలీబాబా ఫౌండర్‌ జాక్ మా‌ను వెనక్కి నెట్టి అయన ఈ స్థానానికి చేరుకొన్నాడు. అయితే కేవలం బుధవారం రోజున అంబానీ తన సంపద విలువ 4.7 బిలియన్ డాలర్ల పెరుగుదలతో మొత్తం విలువ 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక నిన్న ఒక్కరోజే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 10% చేసిన సంగతి అందరికి తెలిసిందే.

 

ఇక ఈ దెబ్బతో ముకేశ్ అంబానీ, జాక్ మాను వెనక్కి నెట్టేశారు. అలీబాబా ఫౌండర్‌ జాక్ మా‌ను సందప విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో పోలిస్తే ఈయన కన్నా అంబానీ సంపద 3.2 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇక అంతర్జాతీయంగా అంబానీ బిలియనీర్ ర్యాంక్ కూడా 17వ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా జాక్ మా 19వ స్థానంలో కొనసాగుతున్నారు.

 

అయితే ఫేస్బుక్ కేవలం రిలయన్స్ జియోలో వాటాలు కొనడం మాత్రమే కాకుండా మరో డీల్ ‌ను కూడా చేసుకొన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, రిలయన్స్ జియో మార్ట్ మధ్య ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా అక్కడ కుదిరింది. దీనితో జియో మార్ట్ ద్వారా వాట్సాప్ సాయంతో ఆన్లైన్ ‌లోనే ఇంటికి సరుకులు ఆర్డర్ ఇచ్చి హోమ్ డెలివరీని తీసుకోవచ్చు. ఈ డీల్స్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకుపోయాయి. దీనితో అంబానీ సందప విలువతో తన స్థానాన్ని తిరిగి పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: