అక్షయ తృతీయ.. ఈ ఏడాది  ఏప్రిల్ 26 వ తేదీన వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు నాడు బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది అనే అభిప్రాయంతో.. వాటిని కొనుగోలు చేయ‌డం ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆన‌వాయితీగా మారింది. ఈ క్ర‌మంలోనే అక్షయ తృతీయ రోజున అన్నింటి కంటే బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయి. ఉన్నవారైన.. లైనివారైన సరే ఎంతోకొంత పసిడిని కొని సంతోషపడతారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. ఇక ఈ రోజున బంగారం కొనుగోలు చేయాలనే ఆచారం పురాణాల్లో ఎక్కడైనా ఉందా అంటే లేదనే చెప్పాలి.

 

వాస్త‌వానికి అక్షయం అంటే తరగనిది అని అర్థం. కాబట్టి ఈ రోజు బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే అక్షయం అవుతుందని భావిస్తారు. అయితే ఈ ఏడాది.. ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని నివారించ‌డానికి ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.  అయితే లాక్ డౌన్ ఉండడంతో అక్షయ తృతీయ రోజు ఈ సారి ఏం చేయాలి అన్న చర్చ మొదలైంది. 

 

బంగారం షాపులు తెరిచి ఉంటే బయటకు వెళ్లి.. బంగారం కొని సెంటిమెంట్ ను కొనసాగించేవారు. మ‌రియు బంగారం షాపులు కూడా అక్షయ తృతియా ఆఫర్లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఇలా ప‌రిస్థితుల్లో మలబార్‌ గోల్డ్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.  అక్షయ తృతీయ సందర్భంగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆధ్వర్యంలో బంగారు ఆభరణాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఏఎస్‌రావునగర్‌ స్టోర్స్‌ ఇన్‌చార్జి పీకె.షిహాబ్‌ తెలిపారు.

 

`ప్రామీస్‌టుప్రొటెక్ట్‌` పేరుతో ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. బంగారు ఆభరణాల తరుగులో 30 శాతం తగ్గింపు, వజ్రాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు, ఎస్బీఐ క్రెడిట్‌ కార్డులపై రూ.15 వేలు అంతకుమించి చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తామని స్పష్టం చేసింది. కాబ‌ట్టి..  లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌లో మీ ఇంటి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చని, ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆయన పేర్కొన్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: