లాక్‌డౌన్ తేదీ  మే3 స‌మీపిస్తున్న కొద్దీ కేంద్ర ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని ప్ర‌జ‌ల‌తో పాటు పారిశ్రామిక వేత్త‌లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ విష‌యంలో ఇప్ప‌టికే కొన్ని అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాల‌కు స‌డ‌లింపునిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే మొత్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. లాక్‌డౌన్ కొన‌సాగింపు...స‌డ‌లింపుల‌పై వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కేంద్రానికి స‌ల‌హాలిస్తున్నారు. 


ఈక్ర‌మంలోనే మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేసిన సూచ‌న ఇప్పుడు అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇంత‌కు ఆనంద్ మ‌హీంద్రా చేసిన సూచ‌న ఏంటంటే.. ‘పరిశోధనల ప్రకారం 49 రోజుల లాక్‌డౌన్‌ సరిపోతుంది. అదే నిజమైతే ఆ తర్వాత దాన్ని సమగ్రంగా ఎత్తివేయొచ్చు అని ట్వీట్ చేశారు. నిపుణులు చెబుతున్న విష‌యాల‌ను కూడా ఆయ‌న కోట్ చేశారు.కరోనా వైరస్‌ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను 49 రోజుల వ్యవధి తర్వాత సంపూర్ణంగా తొలగించడం శ్రేయస్కరమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 

 

ఎందుకంటే వ్యవస్థలో ప్రతీదీ ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటోంది కాబట్టి.. లాక్‌డౌన్‌ను క్రమానుగతంగా తొలగిస్తూ పోయిన పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. ఇక పారిశ్రామిక రికవరీ కూడా చాలా మందకొడిగా సాగుతుందన్నారు. ఉదాహరణకు తయారీ రంగంలో ఒక్క ఫీడర్‌ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నా.. అంతిమంగా ప్రోడక్ట్‌ అసెంబ్లీ యూనిట్‌ పనులన్నీ నిల్చిపోతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఫార్మా, ఐటీ రంగాల‌కు ఇప్ప‌టికే నిబంధ‌న‌లు స‌డ‌లించారు.వ్య‌వ‌సాయ అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల‌కు ద‌క్కింది. మే3 త‌ర్వాత కొన్ని ర‌కాల దుకాణాల‌కు స‌డ‌లింపు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: