లాక్‌డౌన్ ప్ర‌భావం ప్రైవేటు బ్యాంకింగ్‌రంగంపై తీవ్రంగా ప‌డుతోంది. అనేక బ్యాంకులు న‌ష్టాల‌ను మూట‌గట్టుకుంటున్నాయి. బ్యాంకు లావాదేవీలు పూర్తిగా నిలిచ‌పోవ‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఇక ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ‌ ప్రైవేటు బ్యాంకుల్లో ఒక‌టైన యాక్సిస్ గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో ఏకంగా రూ.1,388 కోట్ల మేర‌ నికర నష్టాల్లోకి జారిపోయింది. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మొండి బకాయిలు, ఇతర అనిశ్చిత అంశాలకు నిధుల‌  కేటాయింపులు పెరగడ‌మేన‌ని బ్యాంకు అధికారులు వివ‌ర‌ణ ఇస్తున్నార‌కు. ఇదిలా ఉండ‌గా అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి రూ.1,505 కోట్ల మేర నిక‌ర లాభం ఆర్జించ‌డం గ‌మనార్హం. 


ఇదిలా ఉండ‌గా సుధీర్ఘ‌కాలంగా భార‌త్‌లో లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మ‌వుతోంది. ప్రాణాలు కాపాడుకుంటూనే... ఆర్థిక ప‌త‌నం జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంది. అయితే వ‌చ్చే ప‌ది రోజుల్లో లాక్‌డౌన్ ఎత్తివేయ కుంటే ఆర్థికంగా భార‌త్‌కు కోలుకోని న‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. భారత్‌ వృద్ధి అంచనాలు మరింత క్షీణిస్తే.. దేశ సార్వభౌమ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక‌లో వెల్ల‌డించింది.  కొవిడ్‌-19 ప్రభావంతో వృద్ధి అంచనాలను తగ్గించిన నేప‌థ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ నిష్పత్తిలో భారత రుణభారం 77 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. 


అయితే ప్ర‌స్తుతం ఆర్థికాభివృద్ధి నెమ్మదించడం, ద్రవ్యలోటు పెరగడంతో రుణ‌భారం 77శాతానికి ఎగ‌బాకుతుంద‌ని ఫించ్ స‌ర్వే అంచ‌నావేసింది. లాక్‌డౌన్‌ను మే 3కు పొడిగించిన నేపథ్యంలో వృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చ‌ర్య‌ల్లో భాంగా మరిన్ని ఉద్దీప‌న చ‌ర్య‌ల‌కు పూనుకునే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని నివేదిక‌లో పేర్కొంది.  అలాగే కొన్నేళ్లుగా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోలేకపోతోందని నివేదిక‌లో గుర్తు చేసింది.  ఇదిలా ఉండ‌గా 2020-21లో జీడీపీలో భార‌త్‌ ద్రవ్యలోటు 3.5 శాతంగా అంచనా వేసింది.   లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 34 రోజుల లాక్‌డౌన్ కారణంగా దేశ జీడీపీకి 10.2 లక్షల కోట్ల నుంచి రూ. 13.6 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: