ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. దీనితో బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం బాగా ర్యాలీ చేశాయి. ప్రస్తుత లాక్ డౌన్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను బయట వేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఆర్థిక ప్యాకేజ్ మరొకటి ఉండొచ్చనే అంచనాలు ఇందుకు అసలు కారణం. ఈ కారంతో నేడు అధిక లాభాలతో స్టాక్ మర్కెట్స్ ముగిసాయి. ఇక ఇంట్రాడేలో BSE సెన్సెక్స్ 783 పాయింట్ల లాభంతో 32,898 పాయింట్ల కు చేరుకోగా, NSE నిఫ్టీ కూడా 9500 పాయింట్ల పైగా చేరుకుంది. ఇక రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 32,720 పాయింట్ల వద్ద  606 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 9553 పాయింట్ల వద్ద 172 పాయింట్ల లాభంతో ముగిసాయి.

 

ఇక నేటి మార్కెట్ విశేషాలు చూస్తే ... NIFTY 50లో hdfc, గెయిల్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, HCL టెక్ షేర్లు లాభపడ్డాయి. ఇందులో హిందాల్కో 7% లాభ పడింది. ఇక అదే సమయంలో AXIS బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, HUL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టైటాన్ వంటి షేర్లు బాగా నష్టపోయాయి. ఇందులో AXIS బ్యాంక్ 4% నష్ట పోయింది. ఇంకా నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ లు మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ FMCG, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్ ‌లన్నీ లాభాల్లోనే కొనసాగాయి. అయితే నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లు 3% కి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్‌లు 2% పైగా లాభపడ్డాయి.

 

 

ఇక చివరగా అమెరికా డాలర్ ‌తో పోలిస్తే భారత రూపాయి లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక 49 పైసలు లాభంతో 75.65 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగానే పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ‌కు 4.05% పెరుగుదలతో 23.66 డాలర్లకు చేరుకుంది. WTA క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 16.05% పెరుగుదలతో 14.32 డాలర్లకు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: