అనుకున్న‌ట్లుగానే జ‌రుగుతోంది. క‌రోనా మూల్యాన్ని డ్రాగ‌న్ చెల్లించుకుంటోంది. ఇప్ప‌టికే చాలా దేశాల‌తో వాణిజ్య‌ప‌ర‌మైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా చైనా ఇప్పుడు నేరుగా ఐటీ ఇండ‌స్ట్రీపైనా స‌వాళ్లు కాచుకోనుంది. నెగ‌టివ్‌లో పాజిటివ్ అన్న‌ట్లుగా చాలా దేశాల‌కు చెందిన ఐటీ సంస్థ‌లు చైనాలో భారీ పెట్టుబ‌డులు కుమ్మ‌రించాయి. ఇప్పుడు అక్క‌డి నుంచి మెల్ల‌గా జెండా ఎత్తేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఇగ్లండ్‌, ఫ్రాన్స్‌, పిలిపిన్స్‌, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దాదాపు 11 దేశాల‌కు ఇండియా ఇప్పుడు స్వ‌ర్గ‌ధామంగా క‌నిపిస్తోంది. 


అందుకే ఆయా దేశాల‌కు చెందిన ఐటీ సంస్థ‌లు ఇప్ప‌టికే భార‌త విదేశాంగ శాఖ అధికారుల‌తో చ‌ర్చ‌లు సాగిస్తుండ‌టం విశేషం. ఇలా వ‌స్తున్న ఐటీ సంస్థ‌ల‌ను భార‌త్‌లోని ఆయా రాష్ట్రాలు ఆహ్వానించేందుకు పోటీప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఈ విష‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్రదేశ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ గ‌త మూడు రోజులుగా ఆయా సంస్థ‌ల యాజ‌మాన్యాల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా సంప్రదింపులు నిర్వ‌హిస్తుండ‌టం విశేషం. 

 

ఇక హైద‌రాబాద్‌లో అయితే ఐటీ సంస్థ‌ల‌కు కావాల్సినంత స్పేస్ ఇవ్వ‌డానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండ‌టం విశేషం. 11దేశాల‌కు చెందిన ప‌దుల సంఖ్య‌లోని చిన్న పెద్ద సంస్థ‌లు హైద‌రాబాద్‌కు ర‌ప్పించ గ‌లిగితే ల‌క్ష‌ల్లో ఉపాధిని సృష్టించిన వార‌మ‌వుతామ‌ని కేటీఆర్ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని ఫాలోప్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో యూపీ ప్ర‌భుత్వం కూడా ఐటీ సంస్థ‌ల‌ను త‌మ ప్రాంతానికి ర‌ప్పించేందుకు అనేక రాయితీలు ప్ర‌క‌టించ‌డంతో పాటు భూములను ఫ్రీగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండ‌టం విశేషం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్‌లో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు ఏపీ ప్ర‌భుత్వం కూడా ప్ర‌తిపాద‌న‌ల‌తో ముందుకు వెళ్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: