పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెల రోజులలుగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది.. పడిన చమురు ధరలు లేవలేకపోతున్నాయ్.. ఆరోజు నుండి ఈరోజు వరుకు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ పూర్తయ్యాక పెరుగుతాయి అని అందరూ అనుకున్నారు.. కానీ లాక్ మరో నెల రోజులు కొనసాగేలా కనిపిస్తుంది. దీనికి కారణం కరోనా వైరస్ విజృంభిస్తుంది తప్ప తగ్గటం లేదు.. అందుకే లాక్ డౌన్ కొనసాగుతుంది. 

 

IHG'ripped off for petrol' - BBC News

 

గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

IHG

 

అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గగానే పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయిలో పెరుగుతాయి అని.. ఆ తర్వాత మళ్లీ భారీగా తగ్గుతాయి అని.. అంచనా వేస్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గుతుంది ? లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారు? ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గాలి? ఇంకా చూడాలి ఎప్పుడు తగ్గుతాయో.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: