రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) ఈసారి మాత్రం కొద్ది లాభాలను మాత్రమే ప్రకటించింది. ఇక చివరి ఆర్థిక సంవత్సరం (2019 - 20) ఆఖిరి త్రైమాసికం (జనవరి-మార్చి) లో రూ.6,546 కోట్ల లాభాలు మాత్రమే చూపించింది. అయితే, ఇది గతంతో పోల్చితే ఇది 37 % తగ్గింది. అంతే కాకుండా పోయిన మూడు సంవత్సరాలలో ఇదే అత్యంత తక్కువ త్రైమాసిక లాభాలు అవ్వడం ఆలోచించాల్సిన విషయం. అయితే క్రితం సంవత్సరం (జనవరి-మార్చి) రూ.10,362 కోట్లగా లాభాలను ప్రకటించింది రిలయన్స్‌ సంస్థ. అయితే ఇక పెట్రోకెమికల్‌ వ్యాపారం నుంచి పడిపోయిన రిలయన్స్‌ సంస్థ ఆదాయం.. ఆ సంస్థ లాభాలకు బాగా దెబ్బ పడింది. అయితే ఇక ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6.50 చొప్పున డివిడెండ్‌ కు RIL‌ బోర్డు ఆమోదం ఇచ్చింది. 


అయితే ఇది ఇలా ఉండగా రిలయన్స్‌ జియో నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే 177 % పెరిగింది. అది ఎంతలా అంటే రూ.2,331 కోట్లుగా చేరుకుంది. ఇక క్రిత సంవత్సరం ఇదే సమయంలో జియో సంస్థ లాభం రూ.840 కోట్లకు మాత్రమే ఉన్నది. ఇక ఈ చార్జీల పెంపు, ఇక అలాగే పెరిగిన వినియోగదారులు సంఖ్య కూడా జియో లాభాలను బాగా పెంచాయి. ఒక దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద రైట్స్‌ ఇష్యూకు రిలయన్స్‌ గ్రీన్ ‌సిగ్నల్ ను‌ ఇచ్చింది. అయితే ఈ కంపెనీ రూ.53,125 కోట్ల ఇష్యూతో ముందుకు రాబోతుంది. ఇక ప్రతీ 15 షేర్లకు ఒక షేర్‌ ప్రాతిపదికన వస్తున్న ఈ ఇష్యూ షేర్‌ ధర ఏకంగా రూ.1,257గా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక గురువారం నాడు ట్రేడింగ్‌ లో ఆ సంస్థ షేర్‌ ఏకంగా ఇది 14% తక్కువ. 

 

అయితే ఇక కరోనా వైరస్‌ ప్రభావంతో ఉద్యోగుల జీతాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ కోత పడింది. ఇందులో చాలా మంది ఉద్యోగుల వేతనాల్లో 10 - 50 % వరకు కొత్త వేయాలని నిర్ణయించింది. ఇకపోతే వార్షిక వేతనం రూ.15 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రం ఎలాంటి కోతలు ఉండవని సంస్థ స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఈ ఏడాది తన పూర్తి జీతాన్ని తీసుకోనని సంస్థ చైర్మన్‌, MD‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఇకపోతే ముకేశ్‌ అంబానీ వేతనం రూ.15 కోట్లుగా ఉంది. ఇంకోవైపు రిలయన్స్‌ బోర్డులోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో కూడా ఏకంగా  30 - 50 % కోతలు ఉండిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: