నేడు దేశీయ స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలిపోయింది. దీనితో బెంచ్‌ మార్క్ సూచీలు అన్ని కుప్పకూలాయి. దీనికి కారణం ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో పాటు కరోనా వైరస్‌ లాక్ డౌన్ పొడిగింపు అని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ మొత్తంగా 2086 పాయింట్లు నష్టపోయింది. ఇక దీని బాటలోనే నిఫ్టీ కూడా 9300 పాయింట్ల కిందికి చేరింది. అలాగే చివరకు BSE సెన్సెక్స్ 2002 పాయింట్ల నష్టంతో 31,715 పాయింట్ల వద్ద, NSE నిఫ్టీ 566 పాయింట్ల నష్టంతో 9293 పాయింట్ల వద్ద ముగిసాయి. ఇండెక్స్ ‌లు దాదాపు 6 % వరకు నష్ట పోవడంతో గత రెండు వారాల్లో ఇదే తొలిసారి అవ్వడం గమనార్హం. నేడు ఒక్కరోజే మదుపరుల సంపద ఒక్క రోజులోనే దాదాపు రూ.6 లక్షల కోట్లు పోయాయి.

 


ఇక నేడు స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే... నిఫ్టీ 50లో సిప్లా, భారతీ ఎయిర్‌టెల్ మరి కొన్ని మాత్రమే షేర్లు లాభపడ్డాయి. ఇందులో సిప్లా షేరు 4 % పెరిగింది. ఇక అదే సమయంలో హిందాల్కో, ICICI బ్యాంక్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, hdfc షేర్లు కుప్పకూలాయి. ఈ కంపెనీ షేర్లన్నీ దాదాపు 10 %మేర నష్టపోయాయి. ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ ‌లన్నీ నష్టాల్లోనే ముగియగా నిఫ్టీ ఫార్మా మాత్రం లాభపడింది. ఇక మిగితా ఇండెక్స్‌ లు అన్ని కుప్పకూలాయి. ఇందులో నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌ లు 8 % వరకు నష్టపోయాయి. అలాగే నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో ఇండెక్స్ ‌లు 6 నుంచి 7 % వరకు కుప్పకూలాయి.

 

ఇక అమెరికా డాలర్ ‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇందులో 60 పైసలు నష్టంతో 75.73 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 3.06 % తగ్గుదలతో 25.62 డాలర్లకు చేరగా, WTA క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 8.19 % నష్టంతో  18.16 డాలర్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: