కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా వైరస్ కారణంగా దేశం ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.. అలాంటి ఈ సమయంలో కాదు హోమ్ లోన్ తీసుకోవాలి అని భావించేవారికి గుడ్ న్యూస్ లభించింది.. 

 

తక్కువ వడ్డీకే రుణాలు అందించేందకు కేంద్ర సిద్ధం అవుతున్నట్లు సమాచారం. హోమ్ లోన్‌పై మధ్యతరగతి ప్రజలు మళ్లీ సబ్సిడీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఇంకా మోదీ ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్‌ను మరి కొంత కాలం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు.. 

 

2 సంవత్సరాలు పాటి ఈ స్కీంని పొడిగించాలి అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.. అయితే నిజానికి ఈ సంవత్సరం మర్చి 31 కి ఈ స్కీం గడువు పూర్తయింది.. అయితే హోసింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది అని మంత్రిత్వ శాఖతో చర్చలు జరిగినట్టు నివేదికలు పేర్కొన్నాయి.. 

 

ఇంకా అంతే కాదు.. ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ తో వార్షిక ఆదాయం బట్టి సబ్సిడీ లభిస్తుంది.. 6 నుండు 12 లక్షల రూపాయిల మధ్యలో ఆదాయం వచ్చే వారు ఎంఐజీ 1 కిందకు వస్తారు. అదే 12 లక్షల నుండి 18 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారు ఎంఐజి 2 కేటగిరీలో ఉంటారు.. ఈ రెండు కేటగిరిలో ఉన్న వారికీ ఎంత కాదు 2.30 లక్షల రూపాయలకు పైగా సబ్సిడీ పొందే అవకాశం ఉంది.. చూశారుగా.. ఎంత మంచి శుభవార్త అందిందో..                                  

మరింత సమాచారం తెలుసుకోండి: