అమెరికా, చైనా దేశాల మధ్య  జరుగుతున్న ట్రేడ్‌వార్ తార‌స్థాయికి చేరింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి చైనాయే కార‌ణ‌మ‌ని ఒంటి కాలుపై లేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా డ్రాగన్ దేశానికి మరో షాక్ ఇచ్చారు. చైనా ఈక్విటీస్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఫాక్స్ బిజినెస్ పేర్కొంది. ఫెడరల్ ఉద్యోగుల పదవీ విరమణ నిధిని ‘థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్’ సొమ్మును చైనా ఈక్విటీస్‌లో పెట్టుబడులుగా పెట్టరాదని ట్రంప్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా శ్వేత సౌధం నుంచి విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. 

 

యూఎస్‌ ఫెడరల్‌ రిటైర్‌మెంట్ ఫండ్స్‌ను వెనక్కి తీసుకోవాలని లేబర్ సెక్రటరీ యూజీన్ స్కాలియాకి ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా చైనా స్టాక్‌ మార్కెట్‌లో యూఎస్‌ ఫెడరల్‌ రిటైర్‌మెంట్ ఫండ్స్‌ విలువ దాదాపు 4.5 బిలియన్‌ డాలర్లు ఉంటుందని ఓ అంచనా. కరోనా మహమ్మారికి కారణమైన దేశంగా అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా… ఇటీవ‌ల‌ ఈ మహమ్మారిపై జరుగుతున్న వ్యాక్సీన్ పరిశోధనల సమాచారాన్ని కూడా హ్యాక్ చేస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొన‌డం గ‌మ‌నార్హం. పరిశోధనల తాలూకు డేటాను దొంగ‌లించేందుకు  చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. 


అవ‌కాశం క‌ల్పించుకుని మ‌రీ ప్రాణాంతక మహమ్మారి నోవెల్ కరోనా వైరస్ చైనా సృష్టేనంటూ ఇప్పటికే ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో నేటికి ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగానే ఉంది. వైద్య సిబ్బంది కొర‌త‌తో మెరుగైన సేవ‌లు అంద‌డం లేదు. న్యూయార్క్‌లో గ‌డిచిన వారం రోజులుగా క్ర‌మంగా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం అమెరికాకు ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశంగా చెప్పాలి. ఇదిలా ఉండ‌గా చైనాతో క్ర‌మంగా ఆర్థిక సంబంధాల‌ను తెంచుకునేందుకే అమెరికా ఇష్ట‌ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. చైనాతో వాణిజ్య ఒప్పందంపై తమకు ఆసక్తి లేదనీ.. ఆ దేశంతో దీనిపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని కూడా  ట్రంప్ తేల్చి చెబుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: