ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ క్ర‌మంలో దేశ‌దేశాలు వ్యాప్తిచెంది కొన్ని లక్షల మంది ప్రాణాల‌ను బ‌లీ తీసుకుంటుంది. ఇంకెంత మందిని ఈ క‌రోనా భూతం పొట్ట‌నపెట్టుకుంటోందో అర్థంకాని ప‌రిస్థితి. ఇక ఈ క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప‌డింది. ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. కానీ, ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ బ్యాంకులు పని చేస్తూనే వస్తున్నాయి. అయితే బ్యాంక్ ఖాతాలు ఉన్న‌వారికి నిత్యం బ్యాంకులతో ఎదో ఒక పని ఉంటుంది.

 

అలాంటి వారు నెల‌లో బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో, ఏ రోజు సెలవులో ఖచ్చితంగా తెలుసుకొని ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే బ్యాంకులకు వచ్చే మూడు నెలల కాలంలో ఏకంగా 30 రోజులు సెలవులు ఉన్నాయి. అంటే నెల రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. మ‌రి బ్యాంక్ సెల‌వులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ నెల‌లో 7, 13, 14, 17, 23, 24, 31 తేదీల్లో శని, ఆది వారాల వల్ల బ్యాంకులు పనిచేయవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ నెలలో బ్యాంకుల‌కు ఇత‌ర‌ సెలవులు లేవు. అయితే ఇత‌ర రాష్ట్రాల్లో మాత్రం జూన్ 18న గురు హర్ గోవింద్ జీ జయంతి కారణంగా సెలవు ఉంది.

 

అలాగే జూలైలో శని, ఆదివారాల కారణంగా 5,11,12,19,25,26 తేదీల్లో బ్యాంకులు ప‌నిచేయ‌వు. ఇక జూలై 31న బక్రీద్ కారణంగా మన తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లోనూ బ్యాంకులకు క్లోజ్ కానున్నాయి. అదేవిధంగా, ఆగస్ట్ నెలలో 2, 8, 9, 16, 22, 23, 29, 30 తేదీల్లో శని, ఆదివారాలు కార‌ణంగా బ్యాంకులు పని చేయవు. ఇక ఆగస్ట్ 3న రక్షాబంధన్ కారణంగా బ్యాంకులు ఉండ‌వు. ఆగస్ట్ 11న శ్రీ కృష్ణ జన్మష్టమి, ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 21న హరితలిక, ఆగస్ట్ 22న గణేశ్ చతుర్థి, ఆగస్ట్ 30 మొహరం, ఆగస్ట్ 31న ఓనమ్ కారణంగా బ్యాంకులకు సెలవులు వ‌చ్చాయి. బ్యాంకుల‌కు ఇన్ని సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి.. ముఖ్యమైన పనులు ఉంటే సెలవులకు అనుగుణంగా వాటిని ముందుకు లేదంటే వెనక్కి జరుపుకోవడం మంచిది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: