నేడు దేశీయ స్టాక్ మార్కెట్ అనుకోని విధంగా పరుగులు పెట్టింది. దీనితో బెంచ్ మార్క్ సూచిలన్నీ పరుగులు పెట్టాయి. దీనితో సోమవారం నాడు మార్కెట్ భారీగా లాభపడింది. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల తర్వాత కొన్ని సడలింపుల కారణంగా ఇన్వెస్ట్మెంట్ దారుల సెంటిమెంట్ భారీగా బలపడింది. దీనితో మార్కెట్ ఉరుకులు పెట్టింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1250 పాయింట్లు వరకు లాభపడగా నిఫ్టీ 9932 పాయింట్ల కు చేరుకుంది. ఇక ఇందులో హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు జోరు కలిసొచ్చింది. అలాగే చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 879 పాయింట్లు లాభంతో 33304  వద్ద, అలాగే NSE నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9266 పాయింట్ల వద్ద మార్కెట్స్ ముగిసాయి.

 

ఇక నేటి మార్కెట్ విశేషాల్లోకి చూస్తే... బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడగా అందులో బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 10 శాతానికి పైగా లాభపడింది. ఇక అదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ లో షేర్స్ నష్టాల బాట పడ్డాయి. ఇక ఇందులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3 శాతం పైగా నష్టపోయింది.


ఇకఅలాగే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ లు అన్ని లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ PSU బ్యాంక్ అత్యధికంగా 7 శాతానికి పైగా పెరిగింది. ఇక నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ‌లు 3 శాతానికి పైగా లాభాలలో ముగిసాయి. ఇక అమెరికా డాలర్ ‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో కేవలం 7 పైసలు లాభంతో 75.55 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు మిశ్రమంగా ముగిసాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 0.58 % పెరుగుదలతో 38.06 డాలర్లకు చేరుకోగా, WTA క్రూడ్ ధర బ్యారెల్‌ కు 0.31 % నష్టంతో 35.38 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: