ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడు..., రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ అధినేత అయిన ముకేశ్ అంబానీ, అతని సోదరుడు అనిల్ అంబానీ ఇద్దరి అన్నదమ్ముల సంబంధంపై బ్లూమ్ ‌బర్గ్ ఒక వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తోబుట్టువుల పోటీలలో ముఖేష్ అంబానీ విజయం సొంతం చేసుకున్నారని తెలియజేసింది. అలాగే గత సంవత్సరం జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎరిక్సన్ సంస్థకు చెల్లించవలసిన 460 కోట్ల సహాయం కోసం అనిల్ అంబానీ తనను అడుక్కునే లాగా చేసింది అంటూ తెలియజేశారు.


ఇక వాస్తవానికి ఈ విషయం కోసం అన్నదమ్ముల మధ్య కొన్ని వారాల పాటు చర్చలు కూడా కొనసాగాయి అని బ్లూమ్‌ బర్గ్ తెలియజేయడం జరిగింది. చివరకి డబ్బులు ఇవ్వడం బదులు అనీల్ అంబాని తన ముంబై ఆఫీసులపై  99 ఏళ్ల కాలపరిమితితో రెండు లీజులు ఒక ఒప్పందం గురించి తెలిసినవారు తెలియజేసినట్లు బ్లూమ్ ‌బర్గ్ తెలియజేయడం జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకే అనిల్ అంబానీని అధికారులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీనితో తన తమ్ముడిని ముకేశ్ అంబానీ సహాయం చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే.


అనిల్ అంబానీ కి ముఖ్యంగా రిలయన్స్ నెట్వర్క్ సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆ తర్వాత ముఖేష్ అంబానీ జియో విడుదల చేసిన తర్వాత మరీ దారుణంగా ఆయన పరిస్థితి మారిపోయింది. చివరికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చివరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను మూసి వేయడం జరిగింది. నిజంగా అది ఆయనకు చాలా పెద్ద దెబ్బ. అంతేకాకుండా వివిధ వ్యాపారాల్లో కూడా ఆయనకు తీవ్ర నష్టాలు రావడంతో ఆయనకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఒక చివరాకరికి తన అన్నతో చేసుకున్న ఒప్పందాలతో తాను ఆ పరిస్థితుల నుంచి కాస్త బయటపడినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: