వరుస లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్స్ కు నేడు బ్రేక్ పడింది. నేడు స్టాక్ మార్కెట్లు కొద్దిపాటి నష్టాల్లో ముగిసాయి. ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లు అమ్మకం ఒత్తిడికి లోనవడంతో సూచీలు అన్నీ కూడా నష్టాల బాట పడ్డాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఒకానొక సమయంలో ఏకంగా 400 పాయింట్స్ మేర నష్టం లోకి వెళ్ళిన సెన్సెక్స్ చివరికి మళ్ళీ కాస్త పుంజుకుని 128 పాయింట్లు నష్టంతో 33980 వద్ద ముగిసింది.


ఇంకా అంతే కాకుండా నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 10029 వద్ద ముగిసింది. ఇక అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ చూస్తే ఐదు పైసలు లాభంతో  75.73 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక నేటి మార్కెట్ విషయాలకు వస్తే వేదాంత, టెక్ మహీంద్రా, జి ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ సంస్థలు లాభ పడ్డాయి. ఇక ఇందులో వేదాంత సంబంధించిన షేర్స్ 8 శాతం మేర చాలా పొందాయి. ఇక అలాగే నేడు ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ల్యాండ్, హెచ్ డి ఎఫ్ సి, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా నష్టాల బాట నడిచాయి. ఇక ఇందులో ఏషియన్ పెయింట్స్ 5 శాతం మేర నష్టాల బాట పట్టింది.


ఇక ఇండెక్స్ ల విషయానికి వస్తే నిఫ్టీ ఐటి, నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసిజి లాభాల బాట పడగ మిగతావన్నీ నష్టాలు చవిచూశాయి. అందులో ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ 2.6% నష్టపోయింది. ఇక మరోవైపు బంగారం ధర 501 రూపాయి పెరిగి 24 క్యారెట్స్ కలిగిన బంగారం 46600 చేరుకుంది. కాకపోతే వెండి 63 రూపాయలు నష్టపోయి 48391 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా గత 6 రోజులుగా లాభాలతో కొనసాగుతుండగా నేడు వాటికీ బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: