నేడు మరోసారి దేశీయ మార్కెట్ లాభాల బాట పట్టింది. మొన్నటి వరకు వరుస లాభాలతో కొనసాగిన దేశీయ మార్కెట్ నిన్న ఒక్కరోజు నష్టాలలో ముగిసింది. మళ్లీ నేడు సూచీలన్నీ  లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా కొనుగోళ్ల జోరు కారణంగా మార్కెట్ పరుగులు పెట్టింది. ఇకపోతే నేడు ఇంట్రాడేలో సెన్సెక్స్ 425 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా 10178 పాయింట్ల గరిష్టాన్ని చేరుకుంది. ఇకపోతే చివరకు BSE సెన్సెక్స్ 307 పాయింట్ల లాభంతో 34287 పాయింట్ల వద్ద ముగియగా, NSE నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 10142 పాయింట్ల వద్ద ముగిసింది. 

 

IHG

ఇక నేడు మార్కెట్లో ప్రధానాంశాలు చూస్తే... టాటా మోటార్స్, భారతీ ఇంఫ్రాటెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, హిందాల్కో కంపెనీలు లాభాల బాట పడ్డాయి. ఇందులో టాటా మోటార్స్ 12 శాతం లాభాల బాట పట్టింది. ఇక మరోవైపు టిసిఎస్, HUL, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల బాట పడ్డాయి. ఇక ఇందులో టిసిఎస్ షేర్స్ 2 శాతం పైగా నష్టపోయింది.

IHG

 

ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మార్కెట్ విలువ కాస్త 8 పైసలు లాభపడి 75.81 వద్ద ట్రేడవుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విషయానికి వస్తే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 3.2 శాతం పెరిగి 41.2 7 డాలర్లకు చేరుకుంది. అలాగే డబ్ల్యూటీఏ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 2.4 శాతం పెరిగి 38.31 డాలర్లకు పెరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: