నేడు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. రెస్టారెంట్లు, మాల్స్ తెరవడంతో కేంద్రం అనుమతులు ఇవ్వడం ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇక దీంతో నేడు ప్రారంభంలోనే మంచి దూకుడు కనిపించింది. టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు మంచి లాభాల జోరు అందుకున్నాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 640 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కూడా 10300 పాయింట్ల గరిష్టాన్ని చేరుకుంది. ఇక చివరకు BSE సెన్సెక్స్ 83 పాయింట్లు లాభంతో 34371 పాయింట్ల వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు లాభంతో 10167 పాయింట్ల వద్ద మార్కెట్లు ముగిసాయి. 

 


నేడు మార్కెట్ లాభనష్టాల గురించి చూస్తే..  నిఫ్టీ 50లో యాక్సిస్ బ్యాంక్, బిపిసిఎల్, ongc, ఇండస్ ఇండ్ బ్యాంక్, gail షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇక ఇందులో ఇండస్ ఇండ్ బ్యాంక్, బిపిసిఎల్ షేర్లు ఏడు శాతం పైగా లాభాల బాట పట్టాయి. ఇక అదే సమయంలో శ్రీ సిమెంట్ మోటార్స్ ,ఎం అండ్ ఎం, భారతీ ఇంఫ్రాటెల్, జి ఎంటర్టైన్మెంట్ షేర్లు నష్టాల బాట పట్టాయి. జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు 4 శాతం పైగా నష్టపోయింది.

 


ఇక అలాగే అమెరికన్ డాలర్ తో రూపాయి మారకం విలువ చూస్తే స్వల్ప లాభాలతో ట్రేడ్ జరుగుతోంది. కేవలం మూడు పైసల లాభంతో 75.54 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర విషయానికి వస్తే... బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 0.21 శాతం నష్టపోయి 42.22 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే డబ్ల్యూటీఏ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.91 శాతం నష్టపోయి 39.17 డాలర్లకు చేరుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: